మాజీ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం

మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం

గజ్వేల్ 30 జనవరి 2025 :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 18వ వార్డు లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం వార్డు ప్రజల ఆధ్వర్యంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రముఖులు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మా వార్డు ప్రజల ఆధ్వర్యంలో రాజమౌళికి ఘన సన్మానం చేయడం జరిగిందని మా వార్డు కౌన్సిలర్ గా ఎన్నికై వార్డ్ అభివృద్ధికి విశేష కృషిచేసిన రాజమౌళి సేవలు అభినందనీయమని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, 18 వ వార్డు ప్రజలకు రుణపడి ఉంటానని నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన 18వ వార్డు ప్రజలకు పదవి ఉన్న లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల సేవకే అంకితం అని నాకు అభినందన సభ ఏర్పాటు చేసిన 18 వ వార్డు ఆత్మీయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారామ్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం, పి ఆర్ టి యు, రాష్ట్ర సహాయ అధ్యక్షులు రామకృష్ణ,పద్మశాలి సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుదేవ్,వెంకటేశ్వర ఆలయ బాద్యులు లక్ష్మణ్, వెంకటేశ్వర ఆలయ, నలంద విద్యాలయ బాద్యులు నాగులు,వినాయక కమిటీ బాద్యులు అత్తెల్లి రవి, విధ్యాకర్,సాయి మానస రవి, ఆశోక్, సంపత్,వార్డ్ మహిళా అధ్యక్షులు బాలమణి, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మమతా, వార్డ్ యూత్ అధ్యక్షులు వెంకటేష్,సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సి సంతోష్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు, వార్డు ప్రముఖులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు, వివిధ రంగాల్లో పేరు పొందిన 18 వ వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now