*ఘట్కేసర్ మున్సిపాలిటీ కొత్త ఇంచార్జి కమిషనర్‌కు మాజీ ఛైర్‌పర్సన్ శుభాకాంక్షలు, పలు సమస్యలపై వినతి*
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రశ్న ఆయుధం మే 3
ఈ సందర్భంగా మాజీ ఛైర్‌పర్సన్ ముల్లి పావని మాట్లాడుతూ, మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా గణనీయంగా తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సరిపడా నీరు అందించేందుకు ప్రతి వార్డులో అందుబాటులో ఉన్న బోర్‌లను వినియోగంలోకి తీసుకురావాలని ఆమె కోరారు.
అంతేకాకుండా, పలు వార్డులలో రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. వెంటనే ఆ రోడ్లను బాగు చేయించాలని, మున్సిపాలిటీలోని వీధులు, కాలువలను శుభ్రం చేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చెత్త సేకరణ వాహనాలు కొన్ని వార్డులకు సరిగ్గా రావడం లేదని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రోడ్లపై చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, ఉపాధ్యక్షుడు నాగరాజు ముదిరాజ్, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మైసమ్మ గుట్ట మాజీ చైర్మన్ చిత్తరి యాదవ్, మాజీ వార్డు మెంబర్‌లు నర్సింగ్ రావు, వెంకట్ నారాయణ, మైనార్టీ అధ్యక్షుడు ఫరూక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ రెడ్డి, రఫిక్, కాయుమ్, సత్తి రెడ్డి, మల్లేశ్ యాదవ్, సిరాజ్, గోదా గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.