స్థానిక ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పిదం

ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయవద్దని కోరారు
*ఈనెల10 న ఎస్సీ కులాల మాజీ జెడ్పిటిసి,ఎంపీటీసీ, ప్రతినిధులతొ సమావేశం*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 5 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సి హెచ్ పీ ఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల కార్యాలయం నుండి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ ఎంపీటీసీ,జడ్పిటిసి,వార్డు సభ్యుల ఎస్సీ రిజర్వేషన్ 2019 లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో జనరల్ లో కలిపి తప్పిదం చేశారని అన్నారు.అదే విధానం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరోసారి తప్పిదం చేయకుండా 2014 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆధారంగా ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్నికల ముందు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఉద్యమానికి మాట ఇచ్చిందన్నారు.ఆ మాట మీద కట్టుబడి అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసినారని తెలియజేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షములో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక సంవత్సరం కాలం గడిచిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10 న కొత్తగూడెం సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో సమావేశం ఎస్సీ కులాల మాజీలు జెడ్పిటిసి,ఎంపీటీసీ, వార్డు నెంబర్లు,సర్పంచులు ఉప సర్పంచ్లు,వివిధ పార్టీల,సంఘాల నాయకులు,అభ్యుదయ, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి హాజరై స్థానిక ఎన్నికల రిజర్వేషన్ పై చర్చించుకోవడానికి తప్పకుండా కదలి రావాలని బొమ్మెర కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment