జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి దర్శించుకున్నారు

జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్లను పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.

అలంపూర్ : అక్టోబర్

జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వాళ్లను పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈఓ దీప్తి, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన, పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ ఈవో దీప్తి ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్, గద్వాల నియోజక వర్గ ఇంచార్జి సరిత, ఇస్మాయిల్, నీలి శ్రీనివాసులు, సంధ్య రెడ్డి, ఎమ్మెల్సీ ఆన్సర్ అలీ ఖాన్, రాము, తిరుమల్, రాజీవ్ రెడ్డి, మద్దిలేటి, దేవాలయ ధర్మకర్త శేఖర్ రెడ్డి, ఈఓ దీప్తి,ఎమ్మార్వో మంజుల, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now