అసెంబ్లీలో అడుగు పెట్టలేనంత ఆపద లో మాజీ ముఖ్యమంత్రులు?

పదేళ్లు పాలించినా.. కేసీఆర్ రేవంత్ రెడ్డి దాటికి ప్రభుత్వం కుప్పకూలింది పాపం

పరాజయాన్ని తట్టుకోలేక ఆరు నెలలు తర్వాత ఆయన అసెంబ్లీకి ఆగమనం చేశారు…

తన ప్రభుత్వం హయాంలో మీడియా పాయింట్ ఎత్తి వేసిన కెసిఆర్… అదే మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని….. శపధం చేసి మరుసటి రోజే ముసుగేసిన ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ప్రతిపక్ష నాయకుని హోదా ఉన్నా అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడాలన్నా రరేవంత్ రెడ్డి దాటికి దైర్యం చేయలేక పోతున్నారు❗దేశా రాజకీయాలు దశ – దిశ నిర్దేశం చేస్తా….అని పెద్ద పెద్ద డైలాగ్ లు చెప్పి నేడు అసెంబ్లీలో ప్రభుత్వం కెసిఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ను ఎత్తి చూపుతుంటే తట్టుకోలేని కష్టకాలం లో ఉన్నాడు కెసిఆర్ అండ్ కో..దేశ్ కీ నేత అవుదామని పక్క రాష్టాల్లో అక్కడ అక్కడ సభ లు పెట్టి….సొంత రాష్ట్రంలోనే ఎదురైన దౌర్భాగ్యం అంత ఇంత కాదు…. కటకటాల్లో కూతురు ఉన్నా బయటకు తీసుకురాలేని పరిస్థితి చూస్తున్నాడు…బాప్..తెలంగాణ అసెంబ్లీ లో గత 9 రోజులు జరిగిన ఘటన లు చూస్తుంటే కెసిఆర్ ఇక జీవితం లో అసెంబ్లీ లో అడుగు పెట్టడు అనిపిస్తుంది… BRS నాయకులు మొహాలు పై నెత్తురు చుక్క లేదు…ఇంత బతుకు బతికి ఇదేమి ఖర్మ కేసీఆర్ అనేలా ఉంది పరిస్థితి..ఇక పోతేఅంతనాడు ఇంతనాడే గంగరాజు అన్నట్లు…ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి ఎగిరి తన్నినట్లు ఉంది .రావాలి జగన్ కావాలి జగన్ అని జగన్ కు అధికారం కూడబెట్టిన తరువాత ఐదేళ్లకే అంతమైన పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహనరెడ్డి అరాచక ప్రభుత్వం..పట్టుమని 11 సీట్లు తో ప్రజలు బుద్ది చెప్పారు… ఆ గెలిచినా ఎమ్మెల్యే లు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితి….ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కి కేవలం మొదటి రోజు మాత్రమే ఆలా వచ్చి ఇలా వెళ్లారు జగన్ రెడ్డి.ఎన్నికలు ఫలితల్లో సాధించిన ఘోర పరాజయాన్ని అప్పుడు ఇప్పుడే కోలుకోలేని పరిస్థితి ఉంది… ప్రభుత్వం పై ఉక్కు పాదం అంటూ ధర్నా పేరుతో తన తో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ లో అట్టర్ ప్లాప్ ధర్నా చేశాడు..ఆ తర్వాతైనా శాసనసభలో అడుగుపెట్టేందుకు ఎక్కడ సాహసం చేయని జగన్ రెడ్డిY NOT 175 అని, రాష్టం లో ప్రతి పక్షం ఉండకూడదు అని…సిద్ధం సిద్ధం అంటూ బిగ్గరగా అరిచి గోల పెట్టి బీరాలు పలికినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపించిన దెబ్బకు గెలిచినా పదకొండు మందితో అధికారపక్షాన్ని ఎదిరించలేని పిరికితనం చుస్తునారు..తనకు రాదని తెలిసిన ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీకి రానంటూ జగన్నాటం కు తేరా లేపారు.. తాడేపల్లి లో ఇంట్లో ప్రోజెక్టర్ లో ప్రభుత్వం లో అరాచకాలు అవినీతి అంటూ కావాల్సిన, ఇష్టమైన, భజన చేసే కొందరు మీడియా వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకొని, లోపల కు అనుమతి ఇచ్చి… ఒక్కే ఒక్క కెమెరా పెట్టి ఉకాదంపుడు ప్రసంగాలు ఇస్తున్నాడు… తన ఆవేదన ఏంటో అసెంబ్లీ లో అడుగు పెట్టి అడగొచ్చు కదా..❓ ఇప్పుడు ప్రభుత్వం లో లేడు… కోర్ట్ కేసు లు తరుమూకొని వస్తున్నాయి…పదకొండేళ్ల గా సీబీఐ, ఈడీ కేసులు ఉన్న ప్రజల్లో ఉన్న్నాను, ప్రభుత్వం లో ఉన్నను అంటూ సాకులు చూపి కోర్ట్ కు వెళ్లకుండా… మభ్య పెట్టడు… ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది..తాజాగా అవినీతి అక్రమాల పుట్టలు పగులుతుండటంతో, జగన్ బెంగళూరు లో తిష్ట వేసి… బెంగళూరు తాడేపల్లి కి వారంతపు పయనం చేస్తూ… దేశం వదిలి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటూ గుసగుసలు.జగన్ నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నారు…అనేది కార్యకర్తల మాట..ఏ క్షణాన అరెస్టు చేస్తారో అని భయం భయం గా బిక్కు బిక్కు మంటూ బతుకుతు జీవితం సాగుతుంది..తనకే దిక్కు లేదు.. ఇక కార్యకర్తలకు, నాయకులు కు ఏమి భరోసా ఇస్తాడు అనేది చర్చ..ఇటు కెసిఆర్ – అటు జగన్*||ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, జగన్ లు శాసనసభ సమావేశాలకు దూరంకావడం…వీరిద్దరి వ్యవహార శైలిపై రెండు తెలుగు రాష్టాల్లో వెల్లువెత్తుతున్న విమర్శల వర్షం. మొక్కుబడిగా వచ్చి అసెంబ్లీ లో మొఖం చాటేశారని ఇంటా బయట ఒకటే ప్రచారం..జోరుగా సాగుతున్న చర్చల్లో పాల్గొని పార్టీ శ్రేణులకు జవసత్వాలు నింపలేని దయనీయ పరిస్థితి …ప్రజలు అధికారం అప్పచెప్పేది… బాధ్యత గా మలుచుకోమని… అహంకారం తో అధికారం దూరం చేసుకోమని కాదు..అభివృద్ధి – సంక్షేమం ఎంత ముఖ్యమో…అహంకారం – అణిచివేత ఉంటే ప్రజాస్వామ్యం లో ప్రజలు ఇచ్చే తీర్పు లు తట్టుకోవడం అంతే కష్టం…

Join WhatsApp

Join Now