Site icon PRASHNA AYUDHAM

సోమాజిగూడ యశోద ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ – వైద్య పరీక్షలు కొనసాగుతున్నట్లు సమాచారం

Picsart 25 07 03 23 05 03 854

సోమాజిగూడ యశోద ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ – వైద్య పరీక్షలు కొనసాగుతున్నట్లు సమాచారం

హైదరాబాద్‌:

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనారోగ్యం కారణంగా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతకు లోనవుతున్న కేసీఆర్‌ ను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు.అసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, కేసీఆర్‌ కు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ టెస్టులు, హార్ట్ చెక్‌ప్‌ తోపాటు ఇతర అత్యవసర పరీక్షలు కొనసాగుతున్నాయి. స్పెషలిస్టు డాక్టర్ల బృందం పరిస్థితిని సమీక్షిస్తోంది.

వైద్య బృందం ప్రాథమికంగా కేసీఆర్‌ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని తెలిపినట్లు తెలుస్తోంది. మరికొన్ని పరీక్షల రిపోర్టులు రాకముందు పూర్తి వివరాలను వెల్లడించలేమని వైద్యులు పేర్కొన్నారు.

కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తూ ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ముఖ్యమైన నేతలు, కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై సమీక్ష చేస్తున్నారు.

Exit mobile version