మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రావాలి: మంత్రి పొన్నం
తెలంగాణ మాజీ CM KCR మంగళవారం అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల్లోని BC నాయకులు, మేధావులు, కాంగ్రెస్ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేను రేపు కేబినెట్, ఆ తర్వాత అసెంబ్లీలో ఉంచుతామన్నారు. KCR కుటుంబంలో కవిత మాత్రమే సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇచ్చారని తెలిపారు.