బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టినందుకు ఖండించిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 20: కూకట్‌పల్లి ప్రతినిధి
రంగారావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తన స్వార్థం కోసం తన కుటుంబ స్వార్థం కోసం చేస్తున్న అరాచకాలను ప్రతి ఒక్కదాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి అడ్డు తలుగుతున్నందుకు కేటీఆర్ ని ఏదో ఒక విధంగా కేసులు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీల మీద ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు కానీ కేటీఆర్ ని ఏ విధంగానైనా జైల్లో వేయాలని గంటలు గంటలుగా పోలీస్ డిపార్ట్మెంట్ , మరియు తోటి మంత్రులను కూర్చోబెట్టుకొని ప్లాన్ చేయడం తన కక్షపూరిత వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్నటి వరకి మీ మీద పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి ని అక్రమ కేసు బనాయించి జైల్లో ఉంచారు ఇప్పుడు కేటీఆర్ అక్రమ కేసు బనయించి జైల్లో వేయాలని చూస్తున్నారు మీరు ఎంత చేసిన భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో కచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని అన్నారు.