ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ కౌన్సిలర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
( ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 4:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా రాష్ట్ర సీఎం ను మాజీ కౌన్సిలర్ 21 వ వార్డు తాటి లావణ్య ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీ గడ్డం హిందూప్రియా చంద్రశేఖర్ రెడ్డి కూడా సమక్షంలో ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజల సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చ సాగింది. ప్రాంతీయ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు.