మానవత్వం చాటుకున్న గాదె తిరుపతి…
– కళ్ళు లేని అభాగ్యుడుకి గూడు కల్పించి ఆదుకున్న మాజీ కౌన్సిలర్..

ఆ వ్యక్తికి కళ్ళు లేవు… కుటుంబ సభ్యులు ఎవరు లేరు… పైగా ఉన్న ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి కూలిపోయింది.. దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యుడికి… నేనున్నానంటూ ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన.. 9వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె విజయలక్ష్మి తిరుపతి ఆదుకున్నాడు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన గోపని రాములు అనే 80 ఏళ్లవృద్ధుడు తొమ్మిదవ వార్డు పరిధిలో తన నివాసంలో నివసిస్తున్నాడు. ఈయనకు వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. పైగా గత పదేళ్లుగా అతడికి రెండు కళ్ళు కనిపించవు.. ఇలాంటి పరిస్థితుల్లో కాలం వెళ్ళదిస్తున్న ఆయనకు.. ఇటీవల కురిసిన వర్షానికి ఉన్న ఇల్లు కాస్త కొద్ది కొద్దిగా పూర్తిగా కూలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆయన్ను… ఆ వార్డు మాజీ కౌన్సిలర్ గాదే విజయలక్ష్మి తిరుపతి… ఆ వృద్ధుడు ని శిథిలావస్థలో ఉన్న ఇంటి నుంచి కిరాయి ఇంట్లోకి తరలించి ఇకపై ప్రతీ నెల కిరాయి సైతం బరిస్తానని చెప్పారు. అలాగే మున్సిపల్ అధికారుల సహాయంతో వృద్ధుడి బాధను చూసి చలించిపోయి కిరాయి ఇంట్లోకి తరలించినట్లు మాజీ కౌన్సిలర్ గాదె విజయలక్ష్మి తిరుపతి తెలిపారు.
Post Views: 17