బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్
రోజు తాగి వచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్
నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే.. అన్న లాంటి వాడే ఏం అవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది
రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు
తనను ఎవరూ ఏమి చేయలేరని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదజాలంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థినులు
తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు