సంగారెడ్డి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని 16వ వార్డు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మాజీ కౌన్సిలర్ తన సొంత నిధులతో బోరు వేయించారు. మంగళవారం వార్డులో పర్యటించిన మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ గత మూడు రోజులుగా తాగునీరు రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ తన సొంత నిధులతో బోరు వేయించి, ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగేలా ఈ చర్య తీసుకున్నారు. బోరు పనులను స్వయంగా పర్యవేక్షించిన కౌన్సిలర్, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరమే తన ప్రాధాన్యం ప్రభుత్వం లేదా మున్సిపాలిటీ సహాయం కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో బోరు వేయించారు. ప్రజలు సుఖంగా జీవించాలని తన కర్తవంగా భావిస్తున్నానని కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. స్థానికులు మాజీ కౌన్సిలర్ సేవాభావాన్ని ప్రశంసించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అభివృద్ధి పనులలో ముందుంటున్న మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి 16వ వార్డులో బోరు వేయించిన మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్
Oplus_131072