పలువురిని పరామర్శించిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

పలువురిని పరామర్శించిన మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం 17 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలోని పలువురు ఆత్మీయుల కుటుంబ సభ్యులను బాన్సువాడ పట్టణ ముఖ్య నాయకులతో కలిసి పరామర్శించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్,బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి పాత బాన్సునాడ వాస్తవ్యులు,ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దొనకంటి ప్రవీణ్ గారి మాతృమూర్తి దొనకంటి గంగవ్వ అనారోగ్యంతో గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో ఈరోజు వారి ఇంటికి ప్రవీణ్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో దైర్యం చెప్పారు.పాత బాన్సువాడ వాస్తవ్యులు వీరా రెడ్డి గత కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వీరా రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని తెలిపారు. పట్టణం లోని ఎన్జీవోస్ కాలనీ ఖయ్యూం గత కొన్ని రోజుల క్రితం ద్విచక్రవాహనంతో ప్రమాదవశాత్తూ గాయపడటంతో ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు పోచారం భాస్కర్ రెడ్డి గారి వెంట ఉన్నారు.

Join WhatsApp

Join Now