మాజీ డీజీపీ కాళ్లు చేతులు కట్టేసి కారం చల్లారు..!!

*మాజీ డీజీపీ కాళ్లు చేతులు కట్టేసి కారం చల్లారు*..

ఆపై నూనె పోసి..కూతురుతో కలిసి భార్య కిరాతకం..

ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు

ఒక హత్య.. 100 ప్రశ్నలు..! బెంగళూరు నగరం నడిబొడ్డున సంపన్నులు నివాసం ఉండే ప్రాంతంలో కర్నాటక మాజీ డీజీపీ.. తన నివాసంలోనే హత్యకు గురికావడం కలకలం రేగుతోంది.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ (68) హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.. ఓంప్రకాష్‌ను ఆయన భార్య పల్లవి దారుణంగా చంపేశారు. కళ్లల్లో కారం కొట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. తర్వాత పొడిచి చంపేసింది పల్లవి..

ఓంప్రకాష్‌ ఛాతి, పొట్టభాగాలపై పలు కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. భర్తపై పల్లవి గాజు సీసాతో కూడా దాడి చేసి..

దారుణంగా చంపిందని పోలీసులు చెప్పారు.. అయితే.. హత్య చేసిన విషయాన్ని మాజీ డీజీపీ భార్య పల్లవి మరో పోలీస్‌ అధికారి భార్యకు చెప్పిందని.. పోలీసులు వెల్లడించారు. అయితే.. దాడి జరుగుతున్నవేళ కూతురు కృతి కూడా అక్కడే ఉందని.. పోలీసులు తెలిపారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మాజీ డీజీపీ హత్యకు దారి తీసింది ఆస్తివివాదమని.. ఓంప్రకాష్‌ ఆస్తిని బంధువుకు రాసిచ్చారని.. దీంతో ఈ అంశంపైనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు..

ఆ తర్వాతే భర్తను చంపేసింది భార్య పల్లవి స్కెచ్ వేసి చంపినట్లు పేర్కొంటున్నారు. అయితే ఓంప్రకాష్‌ కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.

ఓంప్రకాష్‌ హత్యపై తల్లీకూతుళ్ల వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు.. వారంరోజుల నుంచి తనను చంపేస్తానంటూ ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారని.. పల్లవి పేర్కొంది.

ఇదే విషయమై నిన్న ఉదయం నుంచి ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే తనను, తన బిడ్డను చంపడానికి ఓంప్రకాష్‌ ప్రయత్నించారని చెప్పింది. కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్యచేశామని కూతురు కృతి చెబుతుంది .. తన తండ్రి కాళ్లుచేతులు కట్టేసి.. కారంచల్లి, వంటనూనె పోశామని ఒప్పుకుంది. కాగా.. హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

ఓం ప్రకాష్ భార్య పల్లవి, కుమార్తె కృతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఓ ప్రకాష్ మృతదేహానికి ఈరోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Join WhatsApp

Join Now