Site icon PRASHNA AYUDHAM

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎఫ్డిసి మాజీ చైర్మన్

WhatsApp Image 2025 02 12 at 6.25.44 PM

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, 12 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండి ఆ బాబా కరుణ కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి, తాజా మాజీ కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఖాజా విరాసద్ ఆలీ, తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, అత్తిలి రవి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version