దత్తాచల స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మాజీ గవర్నర్ దత్తాత్రేయ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): దత్తాచల క్షేత్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిధులు తెప్పించేందుకు కృషి చేస్తానని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ శివారులో దత్త జయంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాచల క్షేత్రంలో వెలసిన స్వయంభు ఏకముఖ దత్తుడిని దర్శించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దత్త స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రపతి సభాపతి శర్మ, దత్తాత్రేయకు స్వామివారి ప్రసాదం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్ యాదవ్, రఘువీరారెడ్డి, నాగ ప్రభుగౌడ్, రాజేందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment