అనవసర ఆరోపణలు చేస్తే ఖబడ్దార్…!
గుడి డబ్బులు తెలియకుండా తీసుకున్నట్లయితే గుడి మెట్లు ఎక్కుతా
బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా…
మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్
ప్రశ్న ఆయుధం 16 సెప్టెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి)
నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పై ప్రమాణం చేస్తూ తడి బట్టలతో గర్భగుడిలోకి పచ్చిబట్టలతో వెళ్లి ప్రమాణం చేస్తానని ఎలాంటి తప్పు చేయలేదని మాజీ జెడ్పిటిసి ద్రోణావల్లి సతీష్ అన్నారు.మంగళవారం ఆయన స్వగ్రాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత తెలంగాణ ప్రభుత్వ హ్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ సమయంలో ఆరు కోట్ల హెచ్డిఎఫ్ నిధులు సరిపోకపోవడంతో తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయం డబ్బులు 30 లక్షలు వడ్డీకి తీసుకొని అందులో నుంచి 5 లక్షలు వడ్డీతో చెల్లించడం జరిగింది అన్నారు.ఆలయ ధర్మ కర్తకు తెలియకుండా డబ్బులు తీసుకున్న మాట అవాస్తమన్నారు ఆలయ కమిటీ సభ్యులు మదిని నాగేశ్వరరావు నరసరాజులకు ఇది విషయం తెలియదా అని ప్రశ్నించారు అలాగే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు వచ్చిన ఆరోపణ కూడా సరికాదన్నారు కావాలని నాపై పనిగట్టుకుని అసత్యపు ప్రచారం చేస్తున్నారని భగవంతునిపై ప్రమాణం చేసి చెబుతున్న గుడి డబ్బులు తెలియకుండా తీసుకున్న ఆరోపణ అవాస్తమన్నారు తెలంగాణ ప్రభుత్వంలో కోట్ల రూపాయల పనులు చేయించానని పెండింగ్ బిల్లులు ఇప్పటివరకు కొన్ని అందలేదని అవి చెల్లిస్తే వెంటనే గుడికి బకాయి పడ్డ 25 లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు గతంలో విశ్వకర్మ అని ప్రస్తుతం బీహార్ కూలి బెంగాల్ కూలి అనడం సరికాదన్నారు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉందని గత పదిహేనులలో పక్క నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం బాన్సువాడ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి జరిగిందని దీంతో పక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గత శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారని ఆరోపించారు కష్టపడి పైకి వచ్చామే తప్ప ఎవరికి దోచుకోలేదన్నారు తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తి ఉందన్నారు ప్రజల్లో ఉంటూ పేదల కోసం కష్టపడుతున్నామన్నారు గతంలో ఉన్న దగ్గర పనిచేసిన వారికి అడిగిన పూర్తి వివరాలు తెలుపుతారని పేర్కొన్నారు. మొరం ఇసుక దందాలు చేసిన వారు ఎందరో పైకి వచ్చారని పక్కనే మంజీరా లో ఇసుక ఉన్న గుప్పెడు ఇసుకను కూడా వాడలేదని అన్నారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
రాబోయే రోజుల్లో అవసరమైతే బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఏ పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగా అనైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీచేసి గెలిచే సత్తా ఉందన్నారు ఇప్పటికైనా నాపై అనవసర ఆరోపణలు మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని హితవ్ పలికారు.