Site icon PRASHNA AYUDHAM

ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

IMG 20250724 WA0037

ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్వి నాయకులు

జమ్మికుంట ఇల్లందకుంట జులై 24 ప్రశ్న ఆయుధం

తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను టిఆర్ఎస్వి నాయకులు ఘనంగా నిర్వహించారు గురువారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ జన్మదిన వేడుకను పురస్కరించుకొని బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేక్ కట్ స్వీట్లు పంపిణీ చేశారు బిఆర్ఎస్వి నాయకులు జవాజి అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో విప్లవత్మకమైన మార్పులు తెచ్చి మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రమును దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా కృషి చేసినాడు అని అనేక కంపెనీలను తీసుకువచ్చి దేశంలో తెలంగాణ రాష్ట్రం వైపు అనేక రాష్ట్రాలు చూడడం జరిగిందని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి తీసుకెళ్లి యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారని తెలిపారు కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత పదవులను పొందాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు చింతల కౌశిక్ వెనిశెట్టి నాగరాజు మహంకాళి రాజు వోద్దుల ప్రశాంత్ సమ్మెట రామకృష్ణ నల్లగొండ రాజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version