బోడుప్పల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి

**బోడుప్పల్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి**

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రశ్న ఆయుధం జులై 6

మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆదివారం రోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్లలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చెంగిచర్లలోని కనక దుర్గ కాలనీలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆలయ అభివృద్ధిపై భవిష్యత్తు చర్యలపై ఆశయాలను వెల్లడించారు. అనంతరం, ద్వారకా కాలనీలోని నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అదేవిధంగా, మొహర్రం పండుగను పురస్కరించుకుని చెంగిచర్లలో నిర్వహించిన పీర్ల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి, భౌమిక సౌహార్దం, సమాజ శాంతి స్థిరంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లారెడ్డి కి స్వాగతం పలికారు.

Join WhatsApp

Join Now