*మాజీమంత్రి బొత్సపై పోలీసులకు ఫిర్యాదు*
AP: గుంటూరు జిల్లాలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై రాజధాని అమరావతి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనమండలిలో అమరావతిని శ్మశానంతో పోలుస్తూ బొత్స మాట్లాడారు. దీంతో బొత్స వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని రాజధాని రైతు కంచర్ల జగన్మోహనరావు, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.