మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

*మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి*

*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దళిత నేత

అంబాల రాజు*

*జమ్మికుంట మార్చి 14 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దళిత జాతి ముద్దుబిడ్డ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని గురువారం రోజున జరిగిన శాసనసభ సమావేశంలో మాజీమంత్రి,సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అగ్రవర్ణ అహంకారంతో దళితుడు అనే చులకన భావంతో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దళిత నేత అంబాల రాజు మాట్లాడుతూ మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకట్ల జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన నుండి దళితుడనే కారణంతో గడ్డం ప్రసాద్ కుమార్ అనేక అవమానాలకు గురవుతున్నాడని గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి బడ్జెట్ పత్రాలను చించివేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చల్లడం పాడి కౌశిక్ రెడ్డి అవివేకానికి నిదర్శనం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నిండు సభలో అందరు చూస్తుండగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అగ్రవర్ణ అహంకారంతో దాడికి ప్రయత్నించారని గత శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన కాడ నుండి బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికారం పోయిందని మింగుడు పడడం లేదని గతంలో బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసింది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏరుపడ్డ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన దళిత ప్రజా ప్రతినిధులకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం గా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ గా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనేకమంది నాయకులకు శాసనమండలి సభ్యులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో అనేక కీలక పదవులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి దక్కింది తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తున్న దళిత ప్రజాప్రతినిధులకు మరో మారు అవమానాలు జరుగుతే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న దళిత సమాజం మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment