*బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే*
*
*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02 కుత్బుల్లాపూర్ ప్రతినిధి*
తెలంగాణ రాష్టంలో “హైడ్రా ఏర్పాటు – రియల్ ఎస్టేట్ రంగం కుదేలు” తో అప్పుల పాలైన కొంపల్లికి చెందిన బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా ఆదివారం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కొంపల్లిలోని వేణుగోపాల్ రెడ్డి నివాసంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు , ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ లతో ఆత్మహత్యకు పాల్పడిన బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ పాలన, కుదేలైన రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఇంట్లో చర్చించిన విషయాలను హరీష్ రావు కు తెలియజేశారు.
మార్పు కోసం నేను కాంగ్రెస్ కు ఓటు వేసి ఆగమయ్యారు. నా ఓటు వృధాగా పోయిందని బాధ ఉంది.
గతంలో బిల్డర్ లాంటి బ్యాంకర్లు మేము ఇస్తామేమిస్తామంటూ లోన్లకు ఎగబడేవారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైడ్రా తో నిజాయితీగా లేఅవుట్లు వేసిన మనలాంటి బిల్డర్ల వైపు, మన వెంచర్ల వైపు కొనుగోలుదారులు అనుమానంగా చూస్తున్నారు. ప్లాట్లు కొనాలంటే ఎందుకో ఇబ్బంది పడుతున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచిగా సాగింది, మార్పు మార్పు అంటూ కాంగ్రెస్కు ఓటు వేసి ఆగమయ్యాం.
అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ లు మాట్లాడుతూ…
బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనని, ప్రభుత్వ అసమర్థ పాలన – అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో రియల్టర్ల, బిల్డర్ల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.
పిల్లల పెళ్లిళ్ల కోసం చదువుల కోసం ఆపదలో ఉన్న వారు అమ్ముకుందామంటే ప్లాట్లు అమ్ముడుపోని దుస్థితి నెలకొంది.
గత పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే, నేడు కాంగ్రెస్ పాలకులు మాత్రం వారి అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను భయపెట్టే విధంగా హైడ్రాను ఏర్పాటుచేసి పెట్టుబడులు ముంబై, నోయిడా, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలిపోయే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు.
బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యతో వారి కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కానీ, బిల్డర్ అసోసియేషన్ సభ్యులు ఎవరు వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరం.
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలుసు అని మాటల్లో చెప్పడం కాదు, మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడండి, వారి కష్టాన్ని అర్థం చేసుకోండి, భవిష్యత్తులో మిగతా బిల్డర్లకు ఈ పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టండి.
బడా బడా బిల్డర్ లతో సమావేశాలు నిర్వహించి రియల్ ఎస్టేట్ అంతా బాగానే ఉందని చెప్పడం కాదు, చిన్నచిన్న బిల్డర్ లతో మాట్లాడండి. రికార్డ్ తే గాని డొక్కాడని బిల్డర్లు ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నారు.
హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ పరిధిలో ఆలస్యం ఎందుకు అవుతుంది.
లంచాల పేరిట వేదింపులు ఎందుకు ఎక్కువవుతున్నాయి.
ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంది. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరే
ఉన్నారు.రియల్ ఎస్టేట్ రంగంపై సమీక్షా సమావేశం నిర్వహించండి.
బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబానికి మా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.