Site icon PRASHNA AYUDHAM

బీఆర్ఎస్‌ పార్టీపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు…

IMG 20250805 WA0024

బీఆర్ఎస్‌ పార్టీపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు…

భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలు కూడా చెప్పారని గుర్తుచేశారు. *బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్తు లేదనే అసంతృప్తితోనే రాజీనామా* చేశానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. *అచ్చంపేట నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని* తెలిపారు. *బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని* చెప్పుకొచ్చారు. *అప్పట్లో బీఎల్ సంతోష్ ఎవరో కూడా తనకు తెలియదని* అన్నారు గువ్వల బాలరాజు. *బీఆర్ఎస్ నాయకత్వం.. ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్‌ను నమ్ముకుంటుందని* వ్యాఖ్యానించారు. జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్లు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. *ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గించారని* గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version