బీఆర్ఎస్ పార్టీపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు…
భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలు కూడా చెప్పారని గుర్తుచేశారు. *బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్తు లేదనే అసంతృప్తితోనే రాజీనామా* చేశానని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. *అచ్చంపేట నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని* తెలిపారు. *బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని* చెప్పుకొచ్చారు. *అప్పట్లో బీఎల్ సంతోష్ ఎవరో కూడా తనకు తెలియదని* అన్నారు గువ్వల బాలరాజు. *బీఆర్ఎస్ నాయకత్వం.. ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్‌ను నమ్ముకుంటుందని* వ్యాఖ్యానించారు. జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్లు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. *ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గించారని* గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.