సినిమా పాటలకు స్టెప్పులు వేసిన టిపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా జనవరి 15
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంగారెడ్డి టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పథంగులు ఎగుర వేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.
జగ్గారెడ్డి తన స్టైలే వేరు
అంటూ అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటారు. మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక రామ్ మందిర్ భక్త మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో కలిసి సరదాగా పతంగులను ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలతో సినిమా పాటలకు స్టెప్పులు వేసి అందరిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు