నిజామాబాద్ జిల్లా బి.ఆర్.ఎస్.అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ పలు కార్యక్రమాల్లో
సుడిగాలి పర్యటన…
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్: 26
ఆర్మూర్ నియోజకవర్గంలో గురువారం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడమేకాక నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన వారి ఇండ్లకెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెల్లారక ముందే ఆలూరు బైపాస్ రోడ్డు పై వాకింగ్ చేస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డు పొడవునా తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు వెలగకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి హైలెవల్ బ్రిడ్జ్ ను పరిశీలించారు. కాగా నందిపేట్ డబుల్ రోడ్డుని పరిశీలించి డివైడర్ పొడవునా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటాలని కోరారు. ఆ తరువాత వరుసగా వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
నూత్ పల్లి గురడీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో గంగాసరం గ్రామానికి చెందిన బద్దం సుబ్బారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మచ్చర్ల గురడీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో బాద్గుణ గ్రామానికి చెందిన తొండాకూర్ గంగారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి కన్వెన్షన్ లో జరిగిన రోహిత్ వివాహ వేడుకకు హజరై వారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారుపెర్కిట్ ఎం ఆర్ గార్డెన్స్ లో జరిగిన నీరడీ రాజా వివాహ వేడుకకు హజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెర్కిట్ శ్రావణ్ గార్డెన్స్ లో జరిగిన అల్లూరి హన్మండ్లు కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెర్కిట్ జీ ఆర్ గార్డెన్స్ లో జరిగిన బట్టు భూమేశ్వర్ కుమారుడి వివాహ వేడుకకు హజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెర్కిట్ జీ కే అర్ ఎస్ గార్డెన్స్ లో జరిగిన వన్నెల్ దేవేందర్ కుమారుడి వివాహానికి జీవన్ రెడ్డి హాజరయ్యారు.