భూనిర్వాసితులకు ప్లాట్ల డాక్యుమెంట్లను పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
*గజ్వేల్ , జనవరి 09,
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం భూములు కోల్పోయిన కొండపాక మండల పరిధిలోని దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన భూనిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లను కొండపాక తహసిల్దార్ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం స్వంత ఖర్చులతో నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసి దస్తావేజులు అందజేయడం పట్ల నర్సారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో భూనిర్వాసితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వాసితుల సంక్షేమానికి కట్టుబడివుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిట్టి దేవేందర్ రెడ్డి, మడుపు భూంరెడ్డి, తహసిల్దార్ దిలీప్ నాయక్, కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు, కుకునూరు పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, మంచాల కనక రాములు, మంచాల చిన్న శ్రీనివాస్, మిట్టపల్లి ఋషి, కందూరి ఐలయ్య, కొయ్యడ వెంకటేశం, అనంతుల నరేందర్, సురేందర్ రావు, ఆరేపల్లి మహాదేవ్ గౌడ్, మల్లేశం, పంజా చిరంజీవి, మల్లికార్జున్, ఏర్పుల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.