మెదక్, జిల్లా శివ్వంపేట జనవరి 18 ప్రశ్న ఆయుధం న్యూస్:
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగయ్య పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఓం ఫాజిల్ నగర్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మత పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నారు.