మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి
తెలంగాణ : సిద్దిపేట జిల్లా దొమ్మాట నియోజకవర్గం (ప్రస్తుతం దుబ్బాక) మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డి(85) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సిద్దిపేట జిల్లా కొండపాక స్వస్థలం. 1985లో దొమ్మాట నియోజకవర్గం నుంచి TDP తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు.