Headlines :
-
కడియం శ్రీహరి పై తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు
-
నమ్మక ద్రోహి, జిత్తులమారి నక్కగా పేరున్న కడియం
-
పార్టీ ఫిరాయింపు గురించి విమర్శలు
ఎన్టీఆర్ , సిబియన్ , కెసిఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం: రాజయ్య
ఎన్టీఆర్, చంద్రబాబు, కెసిఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వీరుడు కడియం శ్రీహరి అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు చేశారు. ‘పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి. నమ్మకద్రోహి, జిత్తులమారి నక్కగా పేరున్న కడియం, కేటీర్‌పై మాట్లాడడం సిగ్గు చేటు. కేటీర్‌పై కడియం నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నా. పార్టీలు మారడంలో కడియం మెరుపు వీరుడు, హైట్రిక్ సాధించాడు’ అని ఎద్దేవా చేశారు.