అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే

కుకునూరు పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి

సిద్దిపేట జిల్లా, 11జనవరి 2025 : కుకునూరు పల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం బొబ్బాయిపల్లి గ్రామంలో అంగన్వాడి భవనముకు పూజా కార్యక్రమం నిర్వహించి, అదే గ్రామంలోని సిసి రోడ్డు పనులకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంలో నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మండల కేంద్రంలో మరియు బొప్పాయిపల్లి గ్రామానికి 28 లక్షలు మంజూరు చేయడం జరిగింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేయడం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. జనవరి నెలలో రైతులకు రైతు భరోసా గాని ఇందిరమ్మ భరోసా వంటి పథకాలను రైతులకు అందే విధంగా చేపడుతామని అన్నారు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో గాని జెడ్పిటిసి ఎలక్షన్లలో గాని గ్రామంలోని ప్రజలకు మనప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల గురించి చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మన ప్రభుత్వానికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ముడుపు భూమిరెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు విరుపాక శ్రీనివాస్ రెడ్డి, తూమ్ మహేందర్, మాజీ ఎంపిటిసి ఇండ్ల కనకయ్య, పెద్ద వెంకటరెడ్డి, తూమ్ శ్రీకాంత్ రెడ్డి, ఎల్లం శివయాదవ్, శ్రీనివాస్ రెడ్డి, బాపురెడ్డి, గీతా రవీందర్ ,గోల ఉపేందర్, కన్నమైన మల్లయ్య ,రెడ్డమైన రవీందర్, మహేష్ ,కన్నమైన రమేష్ ,తూమ్ భాను ప్రసాద్, ఇతర గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now