Site icon PRASHNA AYUDHAM

చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్

IMG 20241015 WA0424

సంగారెడ్డి, నారాయణఖేడ్, అక్టోబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సంజీవనరావుపేటలో కలుషిత బావిని మంగళవారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు బీబీ పాటిల్ పరిశీలించారు. కలుషిత నీరు సేవించి మృతి చెందిన ఇద్దరు కుటుంబీకులను పరామర్శించారు. మృతులు యాదమ్మ, మహేష్ కుటుంబీకులకు 50వేల చొప్పున అందించారు. నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా చేపట్టాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫోన్ చేసి మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని ఈ సందర్భంగా కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి, బీజేపీ నాయకులు మారుతిరెడ్డి, అరుణ్ రాజ్ శేరికార్, మాజీ సర్పంచ్ ఎంబరి విఠల్, దస్తయ్య, తదితరులు ఉన్నారు.

Exit mobile version