Site icon PRASHNA AYUDHAM

ఘనంగా మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు

IMG 20250724 192146

ఘనంగా మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు

తాత ఆశయాలను కొనసాగిస్తా..

ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా..

కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

హుజురాబాద్ జులై 24 ప్రశ్న ఆయుధం

స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వొడితల రాజేశ్వరరావు 14 వర్ధంతిని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యునిగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని,వారి బాటలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని పేద కుటుంబంలో జన్మించిన వారు విద్యకు దూరం కావొద్దని ఆలోచించిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని,ఆనాటి ప్రధానమంత్రి పి.వీ.నరసింహరావుకు చేదోడు వాదోడుగా ఉండి ఆపద సమయంలో దేశ రాజకీయాల్లో తన వంతు సహాయం చేసి రాజకీయ చతురత ప్రదర్శించారని ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు.తాత వారసుడిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ విద్య,వైద్య విషయంలో ముందుండి పేద ప్రజలకు మరింత సేవ చేస్తానని తెలిపారు.అనంతరం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర రావు అభిమానులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version