క్రీడా శాఖ మంత్రిని కలిసిన బోర్లం మాజీ ఎంపిటిసి

క్రీడా శాఖ మంత్రిని కలిసిన బోర్లం మాజీ ఎంపిటిసి

ప్రశ్న ఆయుధం 26 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి)

రాష్ట్ర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్రీడలు పశుసంవర్ధక శాఖమంత్రి వాకాటి శ్రీహరి ని బాన్సువాడ మండలంలోని బోర్లం మాజీ ఎంపీటీసీ పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసి క్రీడకు సంబంధించిన పరికరాలకు నిధులు బోర్లం జిల్లా పరిషత్ హైస్కూల్ కు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.అన్నివిధాల బోర్లం జిల్లా పరిషత్ హైస్కూల్ వివిధ రకాల క్రీడా పరికరాలను సామాగ్రిని సమకూరుస్తానని హామీ ఇచ్చారు. బోర్లం గ్రామంలో పశుసంవర్ధక శాఖ నుండి మినీ వెటర్నటి సబ్ సెంటర్ను మంజూరు చేయాలని మాజీ ఎంపిటిసి శ్రావణి దేవేందర్ రెడ్డి కోరారు.అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీలు పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యుడు మన్నే విటల్ పట్లోళ్ల దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ సీనియర్ నాయకులు బోర్లం మాజీ సదర్స్ దడిగే అహ్మద్ షేక్ మహబూబ్ బోర్లం కాంగ్రెస్ యూత్ నాయకులు గుజ్జరి రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment