మంత్రి సీతక్క ను కలిసిన బోర్లం మాజీ ఎంపీటీసీ
ప్రశ్న ఆయుధం 14 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
హైదరాబాదులోని ప్రజాభవన్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారిని బాన్సువాడ మండలంలోని బోర్లం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.గ్రామ అభివృద్ధి విషయంలో అన్ని విధాలా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మంత్రి సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారని మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి,మన్నే విట్టల్ దాడిగే అహ్మద్ షేక్ మెహబూబ్ కాంగ్రెస్ యూత్ నాయకులు ఖాదిరెడ్డి చిన్ను గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.