పదవీవిరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 29, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని రుద్రారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడిగెల గోవర్ధన్ ఉద్యోగ విరమణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ… ఉద్యోగ పదవీవిరమణ ప్రతి ఒక్క ఉద్యోగుల జీవితంలో సహజమని అన్నారు. గోవర్ధన్ సార్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశం, శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.