మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం కి ఘన నివాళి – శ్రీనివాస్ కుమార్

మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం కి ఘన నివాళి – శ్రీనివాస్ కుమార్

హైదరాబాద్, జూలై 27:

భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి పురస్కరించుకొని, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవా కార్యకర్త వై. శ్రీనివాస్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“భారత దేశాన్ని ప్రపంచానికి గర్వకారణంగా నిలిపిన మహనీయుడు కలాం . దేశం కోసం తన జీవితాంతం తపించిన గొప్ప దేశభక్తుడు. భారతీయ క్షిపణి శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన visionary scientist. భారత రక్షణ వ్యవస్థను అత్యాధునికంగా మార్చిన నేత. అందుకే ఆయనను ‘మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా’ అని గుర్తిస్తారు,” అని తెలిపారు.డాక్టర్ కలాం జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఆయన ఆశయాలు, విలువలు, సాధించాలనే దీక్ష, ప్రజల పట్ల ప్రేమ – ఇవన్నీ ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలుగా శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

Join WhatsApp

Join Now