సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ప్రతినిధి27
భారతదేశ స్థితిగతులను మార్చిన మహానుభావుడు ఆర్థిక పరిస్థితుల్ని అదుపులో ఉంచి, ఒక్కతాటిపై దేశ భవిష్యత్తును మార్చిన మహనీయుడు ,గొప్ప ఆర్థిక వేత దేశం గర్వించే నాయకుడు
భారతదేశ మాజీప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మృతి చెందడం పట్ల దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. అనంతరం పూలమాలవేసి సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే
జారే ఆదినారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓ మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. వారి హయాంలోనే పేద గిరిజనుల , అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి చరిత్రలో నిలిచారని. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు
by Naddi Sai
Published On: December 27, 2024 9:41 pm