మాజీ ప్రధాని మోహన్ సింగ్ మృతి దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…

మాజీ ప్రధాని మోహన్ సింగ్ మృతి దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు…

*పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్*

*జమ్మికుంట డిసెంబర్ 27 ప్రశ్న ఆయుధం:*

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు సంకరి రమేష్ అన్నారు. జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనoగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ,రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రుల శాఖ సలహాదారుగా ,ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ,ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఆర్బిఐ గవర్నర్ వివిధ హోదాలలో పనిచేసిన మన్మోహన్ సింగ్ మృతి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటు అని అన్నారు. 1991 ,2004లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన నైపుణ్యం ,పనితీరుతో గట్టెక్కించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారన్నారు. విద్యాహక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఆహార భద్రత చట్టం ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి వచ్చాయనీ అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రం సతీష్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగురి సదయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దమల రవి గూడెపు సారంగపాణి ఎండి సజ్జు పతకాల అనిల్ లింగారావు కౌన్సిలర్లు దిద్ది రాము రావికంటి రాజు శ్రీపతి నరేష్ దొడ్డే సదానందం దొడ్డే శ్రీకాంత్ బుర్ర కుమార్ పిడుగు భాగ్య స్వప్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now