*గ్రామ నవనిర్మాణ సమితి -కృషి విజ్ఞాన కేంద్రం మాజీ ప్రధాన కార్యదర్శి ముద్దసాని సత్యనారాయణ రెడ్డి మృతి*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 28*
గ్రామ నవ నిర్మాణ్ సమితి -కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట మాజీ ప్రధాన కార్య దర్శి ముద్దసాని సత్యనారాయణ రెడ్డి శనివారం రోజున మృతి చెందారు ఎంతోమందికి స్వయం ఉపాధి పొందేలా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని ఉన్నత భావాలతో మాజీ శాసనసభ్యుడు క్రీస్తు శేషులు పరిపాటి జనార్దన్ రెడ్డి ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి ముద్దసాని సత్యనారాయణ రెడ్డి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వేగురు పల్లి గ్రామంలో 1950 వ సంవత్సరంలో జన్మించారు న్యాయవాది పట్టా తీసుకొని పరి పార్టీ జనార్దన్ రెడ్డి సలహా మేరకు 1986 లో గ్రామ నవనిర్మాణ్ సమితి మొదలయినప్పటి నుండి వివిధ విభాగాలాలో పలు సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యామండలి లో పి జే ఆర్ బి.ఈడి కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్-హుజురాబాద్ కిసాన్ వొకేషనల్ కాలేజ్-జమ్మికుంట లో స్థాపించి చాలామంది విద్యార్థులకు స్వయం ఉపాధి పొందే లా తీర్చి దిద్దారు,ఎందరో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులుగా మారారు
గ్రామ నవ నిర్మాణ్ సమితి ఆధ్వర్యం లో మద్యపానం నిషేధం నినాదం తో చాటింపు కార్యక్రమాలు సమూహ చర్చలు సమావేశాలు నిర్వహించి చాలా గ్రామాలలో వెలుగులు నింపారు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా చెట్లు నాటించె కార్యక్రమాలు చేపట్టారు చాలా కుటుంబాల సమస్యలని ఫామిలి కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా సామాజిక భాద్యతలు నిర్వర్తించి వారి జీవితాలను బాగు పరిచారు కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలతో జనాభా నియంత్రణ పై ఊరూరా అవగాహన కల్పించారు కుష్టు నివారణ సంఘ్ ద్వారా చాలా మంది ఆరోగ్య పరిరక్షణ భాద్యతలు తీసుకొని, వారందరికి పునరావాస కేంద్రాలను వాసాల మర్రి తనుగుల గ్రామాలలో ఏర్పరిచారు ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా చాలా మంది యువతకు పెద్దలకు వివిధ గ్రామాలలో కార్యక్రామాలు నిర్వహించారు.
జమ్మికుంట ఆశ్రమ పాఠశాల ఏర్పాటులో కూడా తనవంతు సహాయ సహకారాలు అందించారు న్యాయ పరమైన చట్టాలపై అవగాహన కార్యక్రమాలను ను గ్రామీణ యువతకు అధికారులకి వివధ సమావేశాల ద్వారా చేరేలా చేసారు
1992 వ సంవత్సరం లో కేవికే లో చేరి రైతుల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు
2019 వ సంవత్సరం లో కేవికే సేవలనుండి స్వతహాగా అనారోగ్య దృష్ట్యా విధులనుండి నిష్క్రమించారు