*రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి గుంతలు పూడ్చిన మాజీ వార్డ్ కౌన్సిలర్ పొనగంటి శ్రీలత-సంపత్*
*జమ్మికుంట జూన్ 11 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ పన్నువసుల్లో మొదటి స్థానంలో నిలిచిన జమ్మికుంట మున్సిపాలిటీ పూర్తి అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పన్నులు ఇచ్చిన వారికి సదుపాయాలు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యత అని గుర్తుచేసి జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో గల మారుతి నగర్ లో రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు వేపుగా పెరిగి, మట్టి రోడ్డులో గుంతలు గుంతలు పడి కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని 8వ వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి శ్రీలత మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి ఏఈ నరేష్ ను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు రోడ్డుపై పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి రోడ్డుపై మొరం పోసి గుంతలు పూడ్చి చదను చేయించారు. అధికారులు దగ్గరుండి పిచ్చి మొక్కలు తొలగించి, గుంతలను పూడ్చి రోడ్డుపై మట్టి పోయించి రోలర్ తో తొక్కించారు. కాలని వాసులు మాజీ కౌన్సిలర్ శ్రీలత – సంపత్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.