Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి మాజీ జెడ్పిటిసి ఉషా గౌడ్ ఆర్థిక సహాయం – సమాజం సాయం చేయాలంటూ పిలుపు

Screenshot 2025 10 16 07 02 02 04 f9ee0578fe1cc94de7482bd41accb329

ఎల్లారెడ్డి, అక్టోబర్ 16, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్ (30) కరెంట్ పోల్కు ఢీకొని మృతిచెందగా, ఆయన భార్య నాలుగు నెలల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందింది. దీంతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.

ఈ హృదయ విదారక పరిస్థితిని గుర్తించిన మాజీ జెడ్పిటిసి ఉషా గౌడ్ గురువారం బాధిత చిన్నారులను పరామర్శించి, వారికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఉషా గౌడ్ మాట్లాడుతూ, “ఈ చిన్నారుల బాధ మన అందరి భాధగా భావించి సమాజం వీరి విద్యా, భవిష్యత్తు కోసం చేయూత ఇవ్వాలి. మనం ఒక అడుగు ముందుకు వేస్తే, వారి జీవితానికి వెలుగు చేకూరుతుంది,” అని పిలుపునిచ్చారు.

తమ బాధను గుర్తించి ఆదరించిన ఉషా గౌడ్ కు చిన్నారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా తల్లిదండ్రులను కోల్పోయిన మేము ఒంటరిగా ఉన్నాం. ఉషా గౌడ్ దయ, ఆదరణ మాకు ధైర్యం ఇచ్చింది,” అని వారు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఘంట సాయిలు, పటేల్ సాయిలు, కమ్మరి భాస్కర్, బొగ్గుల సాయిలు, కొయ్యల రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం సమాజం ఒక్కసారి ఆలోచించి చేయి చేయి కలిపితే, వారి జీవితానికి మళ్లీ వెలుగునిస్తుంది అని గ్రామస్తులు కోరారు.

Exit mobile version