మంచినీటి సమస్యను పరిష్కరించిన మాజీ జడ్పిటిసి
● పబ్బ మహేష్ గుప్తా
శివ్వంపేట మండలం రత్నపూర్ గ్రామంలో కొన్ని రోజులుగా మంచినీటి సమస్య నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మండల తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తన సొంత నిధులతో బుధవారం బోర్ వేయించారు. ఈ సందర్భంగా తాజా మాజీ జెడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా మాట్లాడుతూ, బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా, నేను ప్రతి ఒక్క గ్రామంలో, నా సొంత నిధుల నుండి, తోచినంత సహాయ సహకారాలు అందజేశానని అన్నారు, ఇప్పటికైనా, నా దగ్గరికి సమస్య ఉందని వచ్చిన వాళ్లకి, కూడా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తానని అన్నారు,ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మంచినీటి సమస్యను పరిష్కరించిన మాజీ జెడ్పిటిసి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, తాజా మాజీ సర్పంచ్, బొగ్గుల యాదగిరి,మాజీ సర్పంచ్ శంకర్, శివ్వంపేట తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నరసయ్య అశోక్ ,రవీందర్ గౌడ్ భాస్కర్ చిక్కుడు బాల్లేష్, కుమ్మరి వీరేష్, బొల్లు భాస్కర్, శ్రీనివాస్,యూత్ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు