నలబై ఏళ్ళ సేవకు దక్కిన గౌరవం..

నలబై ఏళ్ళ సేవకు దక్కిన గౌరవం..

సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర అధ్యక్షునిగా నియామకం

ప్రశ్న ఆయుధం హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ లో అధిష్టానం చెప్పిన పనులు చేసుకుంటూ ముందుకు పోతున్న రామచంద్ర రావు కి రాష్ట్ర అధ్యక్ష పదవిని కేంద్ర పార్టీ అప్పగించింది.

ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని విద్యార్థుల తరఫున ఎన్నో సార్లు లాటి దెబ్బలు తిన్న రామచంద్రరావు నేడు తెలంగాణ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా నియామకమయ్యారు

ఉస్మానియా యూనివర్సిటీలో రామచంద్రరావు రామచంద్రరావు అంటేనే ఏబీవీపీ అనే విధంగా పనిచేస్తూ రాష్ట్ర నాయకత్వం రాజకీయ చేరికల్లో భాగంగా బిజెపి పార్టీలోకి ప్రవేశించారు

పార్టీ కౌన్సిలర్ నుండి ఎంపీ దాకా అన్ని పార్టీ చెప్పిన ఎన్నికల్లో పోటీ చేశారు

ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశి గెలుపొందారు గెలుపోటములు పట్టించు కాకుండా నిరంతరం పార్టీ సేవలోనే నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ప్రజల పక్షాన ఆయన అనేక సమస్యల్ని కౌన్సిల్లో వినిపించినటువంటి గొంతు రామచంద్ర రావుది ఒక ప్రశ్నించే గళంగా ప్రజల పక్షాన యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మాట్లాడేటటువంటి వ్యక్తిగా రామచంద్రరావుకున్న గుర్తింపు ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి అలంకరించేలా చేసింది. రామచంద్రరావుకి అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేయడం మొన్నటికి మొన్న మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లోను అలానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోవిజయపతంలో నడిపించారు

బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర పార్టీ రామచంద్ర రావు ని రాష్ట్ర ఇంచార్జిగా నియమిస్తే ఆ పనిని పూర్తి చేసి అత్యంత పకడ్బందీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి కేంద్ర నాయకుల ద్వారా ప్రశంసలు అందుకున్నారు

కుల మతాలతో సంబంధం లేకుండా తన వద్దకు వచ్చే ప్రతి కార్యకర్తకు ఇతోదికంగా సాయం చేయడం న్యాయపరమైనటువంటి అవసరం వచ్చినప్పుడు తన వంతుగా ప్రముఖ న్యాయవాదిగా ఎన్నో రకాలుగా సహకారాలు అందించడం పార్టీని వీడకుండా టికెట్ ఇచ్చిన ఇయ్యకపోయినా పదవి ఇచ్చిన ఇయ్యకపోయినా పార్టీకి విధేయుడుగా ఉంటూ సిద్ధాంతాన్ని నమ్మిన బలమైన కార్యకర్తగా పార్టీ ఎదుగుదలలో ఆయన ఎంతో కృషి చేశారు పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా నియమిస్తే మహానగరంలో పార్టీని విస్తరింప చేయడానికి ఆయన వాడవాడలా తిరిగి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు

ఇలా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అధిష్టానం ఏం చెప్పినా ఆ పనిని పూర్తిగా నిబద్దతతో విజయవంతం చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల ఈసారి ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి వరించిందని చెప్పవచ్చు మొన్నటిసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆ స్థానాన్ని ఈటెల రాజేందర్ కేటాయించి రామచంద్రరావును ఖాళీగా ఉంచిన పార్టీకి పనిచేయమని ఆదేశించిన మారు మాట్లాడకుండా ఆయన పార్టీ కోసం పనిచేయడం కేంద్రం నాయకత్వానికి రామచంద్రరావు పట్ల బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా పేరు రావడానికి కారణమైంది

అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను వద్దని వారించిన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు

అనేక రకాలుగా ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి రామచంద్రరావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు రావడానికి కార్యకర్తలందరూ ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా ఇది రామచంద్ర రావు కే కాదు ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తామన్నారు అందుకే రామచంద్ర రావుకు దక్కినటువంటి అవకాశం పార్టీలో సేవకు గుర్తింపుగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సభ్యుడుగా కూడా ఉన్నారు

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఆయన రకరకాల అభిప్రాయాలను వెల్లడిస్తూ ప్రెస్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఏర్పాటు నుండి యూనియన్ ముఖ్య సలహాదారుగ ఉండి జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించడం లో ముందు వరుసలో ఉండి యూనియన్ కు అండగా నిలబడిన ఆయన ఎన్నిక పట్ల తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర కార్యదర్శి బాపూరావు హర్షం వ్యక్తం చేస్తుంది జాతీయస్థాయిలో ఇండియన్ ఫెరడేసిన వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహ ఆయన ఎన్నిక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఉప అధ్యక్షుడు కసా జహంగీర్ లు సన్మానం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment