సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలంలో అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ప్రక్కన “సేవ్ భద్రాద్రి అధ్వర్యంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , వారి సతీమణి ప్రవీణ పాల్గొన్నారు...
మాట్లాడుతూ సేవ్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీ పాకాల దుర్గాప్రసాద్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మరియు వరదల సమయంలో ముంపు ప్రాంత ప్రజలకు పునరావత కేంద్రాలుగా కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంట మండల నాయకులు రత్నం రమాకాంత్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, భీమవరపు వెంకటరెడ్డి, మహ్మద్ జిందా, దొడ్డిపట్ల కోటేష్, మామిడి పుల్లారావు, గాడి విజయ్, మాచినేని భాను, తదితరులు…