సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన.
ఛట్ పూజ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్.
పటాన్‌చెరు సాకి చెరువు వద్ద సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో పాటు యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛట్ పూజ ఉపవాస విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి, సూర్య భగవానుడి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ, ఉత్తర భారతీయుల ఆరాధ్య దైవమైన సూర్య భగవానుడికి ఈ ఆలయం నిర్మించడం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, పటాన్‌చెరు ప్రాంతం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక నిదర్శనమని, ఇక్కడ నివసించే ఉత్తర భారతీయుల సంక్షేమం కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సూర్య భగవానుడిని ఆరాధించే ఛట్ పూజతో సూర్య దేవాలయం అవసరం స్పష్టమవుతుందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, శ్రీధర్ చారి గారు, గూడెం విక్రం రెడ్డి గారు, సందీప్ షా గారు, జై కిషన్ గారు, సంజయ్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అనేక మంది ఉత్తర భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.*