కొత్తగూడెంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన

అనంతరం కొత్తగూడెం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విక్రమార్క మాట్లాడారు*

రాష్ట్ర అభివృద్ధిని అందుకునే శక్తి దేశంలో ఏ రాష్ట్రానికి లేదు అన్నారు

*పదేళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని, ప్రజల సొమ్ము దుబారా చేసి నారు*
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర అభివృద్ధి చూడలేక అడ్డగోలుగా మాట్లాడే వారికి అభివృద్ధి తోనే సమాధానం చెబుతాం అన్నారు.
గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా,అడవి నష్టపోకుండా ఉండేలా ఇందిరా సౌర జలవికాసాన్ని ప్రారంభిస్తున్నాం.. గిరిజనులపై ఒక్క రూపాయి భారం లేకుండా ఈ పథకం కోసం 12,500 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలియజేశారు.ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే లేనంత విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ చిన్న అంతరాయం లేకుండా రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేశాము.. ఈ రాష్ట్రంలో కరెంటు తెచ్చిందే కాంగ్రెస్ కెసిఆర్ తెచ్చింది లేదు ..ఇచ్చింది లేదు
ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువలకు భూ సేకరణ చేస్తాం.. కాలువలు లేకుండా ప్రాజెక్టులు కట్టిన వృధా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది
గోదావరి నదిపై ఇరిగేషన్ కు అధ్యయనం చేయిస్తాం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనoనేని సాంబశివరావు, వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now