తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలే..

IMG 20240819 WA0055

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని చెప్పింది. ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రాయలసీమ, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొమొరిన్‌ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది.. కేపి

Join WhatsApp

Join Now