ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి
Jul 26, 2025, ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నైరుతి ప్రాంతంలో మావోయిస్టుల ఉనికికి సంబంధించి సమాచారం అందగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.