ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత.!
*మృతుల్లో తండ్రి, కుమార్తె, మనవళ్లు.
అక్టోబర్ 15 భిక్కనూర్ ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల పరిధి జంగంపల్లి గ్రామం లోని జాతీయ రహదారి 44పై బుధవారం రోజున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు..పోలీస్ ల వివరాల ప్రకారం…..కామారెడ్డి నుండి భిక్కనూర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అపసవ్య దిశలో వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడం తో తండ్రి,కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా,మనవళ్లు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ..మృతి చెందారు.మృతుల్లో తండ్రి కిషన్ (53),కుమార్తె జస్లిన్ (29),మనవళ్లు జోయల్ ప్రకాష్ (04),జోయల్ జడ్సన్ (ఆరు నెలల బాబు)గా పోలీస్ లు గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆంజనేయులు వివరించారు.